

మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం
శంఖవరం/రౌతులపూడి మన న్యూస్ (అపురూప్):- ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలు చూపిస్తున్న అభిమానం మరవలేనిదని కొన్ని దశాబ్దాల కాలం నుండి నా తండ్రి నుండి నన్ను, నా కుమారుడు గిరిబాబును కూడా మీరందరూ ఆదరించి ముందుకు నడిపించి మా కుటుంబానికి గుర్తింపు ఇచ్చి ఉన్నత స్థాయికి చేర్చిన నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకోలేనిదని మాజీ మంత్రి, పీఏసీ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం అన్నారు. రౌతులపూడి గ్రామంలో వాసిరెడ్డి దేవుళ్ళు, ఐస్ లను ముద్రగడ పద్మనాభం, తన తనయుడు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ గిరిబాబు తో మర్యాదపూర్వకంగా కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రాజవరం గ్రామంలో వైసీపీ నేత సోమరౌతు తిరుమల వెంకన్న దొర నివాసంలో ముద్రగడ పద్మనాభం, ముద్రగడ గిరిబాబును వైసిపి కార్యకర్తలు, నాయకులు అభిమానులు కలిశారు. ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారని కూటమి ప్రభుత్వం చేసే వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. నేను ఈ స్థాయికి వచ్చాను అంటే నియోజకవర్గ ప్రజలు చూపించిన అభిమానంతోనే ఈ స్థాయిలో ఉన్నానన్నారు. ములగపూడి లో మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ అంకంరెడ్డి సతీష్ నివాసంలో ముద్రగడ కార్యకర్తలను అభిమానులను కలిశారు. నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న తన తనయుడు గిరిబాబును మీరందరూ నన్ను ఆశీర్వదించినట్టే గిరిబాబును కూడా ఆశీర్వదించి రాజకీయాల్లో ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లాలని గిరిబాబును ఒక ఉద్యమకారుడుగా తీసుకువెళ్లే బాధ్యత మీ అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, జడ్పిటిసి గొల్లు దివానం, వాసిరెడ్డి జమీల్, కాకి నాని, వైస్ ఎంపీపీ సాయి, సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.