గూడూరు మన న్యూస్ :- ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీ యూనివర్సిటీ లో జరిగిన పత్రిక సమావేశం చైర్మన్ డాక్టర్ వంకి పెంచలయ్య మాట్లాడుతూ ఇంతగా మా విద్యా సంస్థలను ఆదరించి మా ఉన్నతి లో భాగమైన పత్రిక మిత్రులకు, విద్యార్థులకు వారి యొక్క తల్లీ తండ్రులకు ధన్యవాదములు తెలియచేసారు. ఈ విద్యా సంవత్సరలో ఇంటర్మీడియట్ లో 975 మార్కులు అంత కంటే ఎక్కువ వచ్చిన వారికీ ఫ్రీ సీట్స్ ఇవ్వడం జరుగుతుంది అని ఈ అవకాశ్యాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలి అని తెలియచేశారు. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రామయ్య గారు మాట్లాడుతూ మా విద్యాసంస్థలు అన్నింటిలోనూ ముందు వరసలో ఉన్నాయని చెప్పారు. ఇంచార్జి ప్రిన్సిపాల్ మరియు డీన్ అకాడమిక్స్ డాక్టర్ ఎం రాజయ్య మాట్లాడుతూ మా విద్యాసంస్థలో ఇంజనీరింగ్, మానేజ్మెంట్ స్టడీస్, లీగల్ స్టడీస్, హోటల్ మానేజ్మెంట్, డిజైన్ కోర్సులు, ఫార్మసీ కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అడ్మిషన్స్ ఇంచార్జి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు యూనివర్సిటీ లలో చదవడానికి చెన్నై, హైదరాబాద్ లకు వెళ్ళేవాళ్ళని ఇక మీదట అలా అవసరం లేదని మనకు అందుబాటులో అన్నీ వసతులతో ఆదిశంకర యూనివర్సిటీ ఉందని తెలియచేసారు. ఈ సమావేశం లోవివిధ విభాగాల డీన్స్, హెడ్స్ మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *