అబద్దాలతో మసిబూసి మారేడు కాయ చేయాలని చూస్తున్నారు. ర్యాలంపాడు రిజర్వాయర్ రిపేర్ల పై ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు చెబుతారు. సిట్టింగ్ హైకోర్టు చర్చిచే ఎంక్వయిరీ చేయించాలి.

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 29 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే డీకే భరత సింహారెడ్డి. జూరాల ప్రాజెక్టు, ర్యాలంపాడు రిజర్వాయర్ ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే భరత సింహారెడ్డి. ర్యాలంపాడు రిజర్వాయర్ పై ఇంకెన్ని రోజులు అబద్దాలు చెప్తారని మసిపూసి మారేడు కాయ చేసి అది చేస్తాం, ఇది చేస్తామంటూ రోజుకో అబద్దం చెబుతున్నారని ఆయన అన్నారు. గట్టు లిఫ్ట్ రివ్యూ మీటింగ్ వచ్చినప్పుడు ర్యాలంపాడు రిజర్వాయర్ కు రిపేర్లు చేస్తామని చెప్పిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్లీ ఆరు నెలల తర్వాత వచ్చి మళ్లీ ఉత్త మాటలు చెప్పి రిపేర్లు చేస్తామంటూ కాకమ్మ కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. ర్యాలంపాడు రిజర్వాయర్ నిర్మాణము కేవలం రెండు టీఎంసీలకు డిజైన్ చేయబడింది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పుడు నాలుగు టీఎంసీల నీళ్లు ఆపాలన్నా, బుంగలు రిపేర్లు జరగాలన్న బండ్ మార్చాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. దీనిపై గతంలోనే తాము ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ అప్పటినుంచి మురళీధర్ రావు బిల్లులు చెల్లించడం జరిగిందన్నారు. ఇప్పుడు జరిగే అన్ని పరిణామాలపై గతంలోనే తాము స్పష్టంగా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. 300 పేజీల నివేదిక తమ దగ్గర ఉన్నదని ఇందులో ఏ ఒక్కటి అబద్ధమాన్ని తీర్చిన తాము రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. ర్యాలంపాడ్ రిజర్వాయర్ పై సిట్టింగ్ హైకోర్టు జడ్జిచే విచారణ చేయాలని డిమాండ్ చేశారు. జూరాల ప్రాజెక్టు పై నిజాలే చెప్పాను, జూరాల ప్రాజెక్టుపై ముమ్మాటికి తాను మొత్తం నిజాలే మాట్లాడడం జరిగిందని, ఎవరిని భయభ్రాంతులకు గురి చేసినందుకు మాట్లాడలేదని విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. లిఫ్టులు పనిచేయకపోయినా సిల్ట్ ను తొలగించామని చెప్పడం వారికే చెల్లుతుందన్నారు. స్వప్న కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎలాంటి పనులు చేయకుండానే ఏటా నాలుగు కోట్లు ఇస్తున్నది వాస్తవం కాదా అనే విషయాన్ని ఆఫీసర్లు, అధికార పార్టీ నాయకులు బహిర్గతం చేయాలన్నారు. రోప్ లు తెగిపోయి నాలుగు గేట్లు ద్వారా నీళ్లు కూడా వదిలేయని పరిస్థితి ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట రాములు,జిల్లా ఉపాధ్యక్షుడు రజక నరసింహ, బిజెపి సీనియర్ నాయకులు మిర్జాపురం రామచంద్రరెడ్డి, సంజీవ్ భరద్వాజ్, కృష్ణం రాజు, రఘు గౌడ్ తదితరులు ఉన్నారు..

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///