• ఇంటి నిర్మాణానికి తవ్విన గుంతలో పడిన ముగ్గురు ఒకరు మృతి మరొకరు పరిస్థితి విషమం…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి (అపురూప్) :- నూతనంగా ఇంటి నిర్మాణ శంఖుస్థాపన కొరకు తవ్విన గుంతలోకి ఆడుతూ పాడుతూ వెళ్ళి ప్రమాదవశాత్తూ నీళ్ళలో పడిన ఇద్దరు పాఠశాల విద్యార్థుల్లో ఒకరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మండల కేంద్రం శంఖవరంలోని అంబేద్కర్ నగర్ కాలనీలోని మండల ప్రజా పరిషత్తు ప్రాధమిక పాఠశాల సమీపంలోని ఇండియన్ మెధడిస్ట్ ఎవాంజిలిజం చర్చి పక్కనే శనివారం సాయంత్రం పాఠశాల ముగిసిన అనంతరం జరిగింది.ఇటువలె నాలుగు రోజులుగా వర్షాలు విస్తరంగా పడడంతో గుంతలన్నీ నీటితో మునిగిపోయాయి. పాఠశాల నుండి ఇంటికి చేరిన చిన్నారులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్లు పుస్తకాలు యూనిఫామ్ ఇంటిదగ్గర జాగ్రత్త చేసుకొని ఆటలకై వెళుతూ గుంతలు గమనించకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అదే మార్గంలో వెళ్తున్న స్థానికుడు చిన్నారుల నీటిలో మునగగానే గమనించి తక్షణమే రక్షించే ప్రయత్నం చేశారు. వీరిలో ఒకరు క్షేమంగా బయటపడగా మిగిలిన ఇద్దరు భూర్తి. మహి,(7 ) (తండ్రి) సత్తిబాబు, పులి. ప్రణయ్ జోష్ (7)(తండ్రి) పులి రాధాకృష్ణ అప్పటికే మునిగిపోయి బురద నీటిని తాగడంతో తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వెంటనే శంఖవరం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా భూర్తి మహి మార్గ మధ్యలో చనిపోయాడు. ప్రాణ ప్రాయ స్థితిలో ఉన్న పులి ప్రవీణ్ జోష్ ను శంఖవరం ఆస్పత్రి నుండి రౌతులపూడి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కొరకు 108 అంబులెన్స్ వాహనంలో కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన భూర్తి మహి కుటుంబ సభ్యులు వార్ణనతీతంగా మారింది.మృతి చెందిన బాలురు తండ్రికి మహి మూడవ సంతానం, వీరిది వ్యవసాయ కుటుంబం, నివాసానికి ఇల్లు లేని పరిస్థితి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *