వైభవంగా ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ కార్తీక వనభోజనాలు

Mana Cinema:- కార్తీక మాసంలో ప్రతి ఇల్లూ ఓ గుడిగా, ప్రతి గుడీ ఓ పుణ్యక్షేత్రంగా మారిపోతుంది. ఇక ఏడాదిలో ఎప్పుడు కుదిరినా కుదరకున్నా బంధువులను, ఆప్తమిత్రులను కలిసి వారితో సమయం గడిపేందుకు వనభోజనాలు గొప్ప సందర్భాలు. కార్తీక పురాణంలో వనభోజనాల ప్రసక్తి ప్రముఖంగా కనిపిస్తుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ఉన్న వనంలో, విష్ణుమూర్తిని అర్చించి వనభోజనం చేసినవారి సకల పాపాలూ తొలగిపోతాయన్నది పురాణంలోని మాట.ఈ క్రమంలోనే కార్తీక మాసం పురస్కరించుకుని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో కార్తీక వన భోజన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. 24 నవంబర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటపాటలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జన్వాడలోని కేఎల్ఎన్ రాజు ఫార్మ్ హౌస్ లో వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో మహిళా సభ్యులు, వారి పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరికి స్పాన్సర్ సిద్ధార్థ జ్యువెలర్స్ కృష్ణప్రసాద్ వేమూరి, నాగిని ప్రసాద్ వేమూరి విజేతలకు బహుమతులను అందించారు. ఈ వేడుకల్లో ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ప్రెసిడెంట్ శ్రీ కేఎస్ రామారావు గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎస్ఎన్ రెడ్డి గారు, సెక్రెటరీ శ్రీ తుమ్మల రంగారావు గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ సదాశివరెడ్డి గారు, కమిటీ మెంబర్లు కాజా సూర్యనారాయణ, ఏడిద రాజా, వీ.వీ.జి. కృష్ణంరాజు, భాస్కర్ నాయుడు, కోగంటి భవానీ ఇతర కమిటీ సభ్యులు ఈ కార్యక్రమం ఏర్పాట్లు దగ్గరుండి చేశారు. ఇక ఎఫ్ఎన్సీసీ కల్చరల్ కమిటీ చైర్మన్ ఏ. గోపాలరావు, అడిషనల్ చైర్మన్ సురేష్ కొండేటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి.

  • Related Posts

    వినూత్న ప్రేమకథతో రాబోతున్న ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ మొదటి చిత్రం !!!

    వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో ఒక చిత్రం రాబోతోంది. యువతను విపరీతంగా ఆకట్టుకునే ప్రయత్నమే ఈ చిత్రం. ఇప్పటివరకు సందేశం, సామాజిక స్పృహతో సినిమాలు చేసిన దర్శకుడు భాను మొట్టమొదటి సారిగా…

    షూటింగ్ పూర్తి చేసుకున్న “దీక్ష”

    మన న్యూస్ : ఆర్ కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, పి. అశోకుమార్ నిర్మాతలుగా, ఆర్ కె గౌడ్ దర్శకత్వంలో కిరణ్, ఆలేఖ్యరెడ్డి హీరో హీరోయిన్స్ గా ఆక్స ఖాన్, తులసి, అనూష,కీర్తన,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అమరావతి బహిరంగ సభకు వెదరుకుప్పం నాయకుల ప్రస్థానం- రేపే అమరావతి రాజధాని పనులు పునః ప్రారంభం

    అమరావతి బహిరంగ సభకు వెదరుకుప్పం నాయకుల ప్రస్థానం- రేపే అమరావతి రాజధాని పనులు పునః ప్రారంభం

    175 నియోజకవర్గంలో 175 ఎంఎస్ఎమ్ఈ పార్కులు- రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

    175 నియోజకవర్గంలో 175 ఎంఎస్ఎమ్ఈ పార్కులు- రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

    ఈస్ట్ డిఎస్పీ ని సన్మానించిన సింగంశెట్టి సుబ్బరామయ్య

    ఈస్ట్ డిఎస్పీ ని సన్మానించిన సింగంశెట్టి సుబ్బరామయ్య

    సిపిఎస్ ఉద్యోగులారా ఏకం కండి.. నినాదంతో చైతన్య యాత్ర..

    సిపిఎస్ ఉద్యోగులారా ఏకం కండి.. నినాదంతో చైతన్య యాత్ర..

    పోతిరెడ్డి పాళెం రోడ్డు ప్రమాదంలో మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించి మానవత్వం చాటుకున్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    పోతిరెడ్డి పాళెం రోడ్డు ప్రమాదంలో మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించి మానవత్వం చాటుకున్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    పోతిరెడ్డిపాలెం దుర్ఘటన అత్యంత విషాదకరం – నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    పోతిరెడ్డిపాలెం దుర్ఘటన అత్యంత విషాదకరం – నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి