గూడూరు, మన న్యూస్: . నాయుడు పేట మున్సిపాలిటీ పరిధిలోని కరెంట్ ఆఫీస్ సెంటర్లో బుధవారం జరుగుతున్న పారిశుద్ధ్య పనులను నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా పరిశీలించారు. ప్రతి నిత్యం ఉదయం 5 గంటలకే మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా మున్సిపాలిటీలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ పారిశుధ్య కార్మికుల చేపడుతున్న పనులను పరిశీలించి, పారిశుద్ధ్యన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.పట్టణ ప్రజలు పారిశుద్ధ్యన్ని మెరుగుపరిచేందుకు మున్సిపాలిటీ సిబ్బందికి సహకరించాలని కోరారు.తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి తమ ఇళ్ల వద్దకు వచ్చే పరిస్థితి కార్మికులకు అందించాలని సూచించారు. చెత్తాచెదారాలను డ్రైనేజీ కాలవల్లో వేయకూడదన్నారు.పట్టణ ప్రజలు అవగాహన లేకుండా డ్రైనేజీ కాలవల్లో చెత్తను వేయడం వల్ల మురుగునీరు పారే వీలు లేకుండా పోతుంది అన్నారు. పట్టణంలో పారిశుద్ధ్యన్ని మెరుగుపరిచేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఆయన వెంట సచివాల సిబ్బంది పెంచల రెడ్డి, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *