• జై భీమ్ యూత్ సభ్యులు గునపర్తి అపురూప్..
  • జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహ అవమానానికి నిరసనగా పాలాభిషేకం…

శంఖవరం మన న్యూస్ (అపురూప్):- అంబేద్కర్ కులానికో మతానికో నాయకుడు కాదని అంబేద్కర్ అందరూ వాడిని శంఖవరం జై భీమ్ యూత్ సభ్యులు కొనియాడారు.
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం లో శంఖవరం. మండల కేంద్రమైన శంఖవరం గ్రామంలో గత ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా జరిగిన వేడుకలు అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు ఆయన విగ్రహానికి చెప్పుల దండ వేసి తీవ్ర అవమానానికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈ దారుణ సంఘటనపై జిల్లావ్యాప్తంగా దళిత సంఘాలు తీవ్రంగా స్పందించాయి. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అన్నవరం సబ్ ఇన్స్పెక్టర్ శ్రీహరిబాబు పడాల వాసు అనే నిందితుడను గుర్తించి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది.  ఈ నేపథ్యంలో శంఖవరం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం ఉదయం జై భీమ్  ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి, ఘనంగా నివాళులు అర్పించారు. విగ్రహాన్ని పుష్పమాలలతో అలంకరించి, అంబేద్కర్  భావమూర్తికి అఖండ గౌరవాన్ని చాటారు. ఈ సందర్భంగా జై భీమ్ సభ్యులు పులి సుధాకర్, గుద్దాటి నాగేశ్వరరావు, గునపర్తి అపురూప్ మాట్లాడుతూ, అంబేద్కర్  విగ్రహాన్ని అవమానించడం కేవలం ఒక విగ్రహంపై దాడి కాదు, అది రాజ్యాంగంపై దాడి, సామాజిక న్యాయం మీద ఆగ్రహంగా భావించాల్సిన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు.ఒకవేళ ఇలాంటి సంఘటనలు మళ్లీ జరుగుతాయంటే, మౌనంగా ఉండబోమని, అవసరమైతే జిల్లావ్యాప్తంగా ఆందోళనలను తీవ్రరూపంలో చేపడతామన్నారు. ప్రజల మధ్య సామాజిక సమరస్యతను భద్రపరచడానికి ప్రభుత్వ యంత్రాంగం మరింత బాధ్యతగా వ్యవహరించాలని కూడా వారు సూచించారు.ఈ కార్యక్రమంలో గునపర్తి అపురూప్, పులి సుధాకర్, బత్తిన తాతాజీ, గుద్దటి నాగేశ్వరరావు, బత్తిన శివరాం, పులి కిషోర్, గొల్లి జాన్, చెవల నూకరాజు, కారకటి నాగేశ్వరరావు, కొంకిపూడి అప్పారావు, గుడాల జాన్, రాయుడు మహేష్, కానేటి సల్మాన్ రాజు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *