• శంఖవరం ప్రభుత్వ పిహెచ్సీ డిడివో గా బాధ్యతలు

శంఖవరం మన న్యూస్ (అపురూప్):- శంఖవరం మండల కేంద్రమైన శంఖవరం గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్సీ)లో డాక్టర్ శెట్టిబత్తుల రాజీవ్ కుమార్ నూతన డిడిఓ (డ్యూటీ మెడికల్ ఆఫీసర్)గా బాధ్యతలు చేపట్టారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు ఆయనను శంఖవరం పిహెచ్సీ వైద్య అధికారిగా సేవలు అందిస్తున్న రాజీవ్ కుమార్ కు డి డి ఓ గా బాధ్యతలు అప్పగించడం జరిగింది. వైద్యులు ఆర్వివి సత్యనారాయణ 6 సంవత్సరాల 5 నెలలు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రధాన వైద్యాధికారి (డి డి వో) గా పని చేసారు. ధవలేశ్వరం పి హెచ్ సి కి బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో రాజీవ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా స్థానిక వైద్య సిబ్బంది, గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ – “గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్యసేవలను సమయానికి అందించడం నా మొదటి కర్తవ్యం అని పిహెచ్సీలో విస్తృతంగా ఆరోగ్య సేవలను అందించేందుకు సిబ్బంది సహకారంతో పని చేస్తానన్నారు. ప్రజలతో సమన్వయం ద్వారా ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు క్యాంపులు, వైద్య శిబిరాలు నిర్వహిస్తాం. నూతన విధానాలు తీసుకురావడంలోనూ కృషి చేస్తాం” అని తెలిపారు. నేటి టెక్నాలజీ ప్రకారం నూతన వైద్య విధానాలపై రాజీవ్ కుమార్ విశేష అవగాహన ఉందని నూతన డిడిఓ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ప్రజలు మెరుగైన సేవలపై ఆశలు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్న చిన్న సమావేశంలో ఆరోగ్య కేంద్రంలో ఉన్న సదుపాయాలపై సమీక్ష చేసి, తక్షణమే అవసరమైన పరికరాల సమీకరణ కోసం ప్రతిపాదనలు పంపుతానని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *