

మన న్యూస్ : కాపు, తెలగ, ఒంటరి సంఘం వారి కార్తీక మాస వనభోజన మహోత్సవం లో, “ప్రతిమ సాయి బ్లడ్ బ్యాంక్” వారి చే ‘లయన్స్ క్లబ్ విశ్వాస్’ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ మార్కండేయులు తో పాటు పద్మశ్రీ డాక్టర్ చంద్రశేఖర్ , దొర రాజు , ఛైర్మన్ మిఠాయి అల్లం నాగేశ్వరరావు , డాక్టర్ బొగ్గు సురేశ్ , డాక్టర్ పెండెం కృష్ణ కుమార్ , డాక్టర్ రామ్మోహన్ నాయుడు , డాక్టర్ విజయరంగా గారు, డాక్టర్ నరేశ్ , సారంగ పాణి అలాగే వనస్థలిపురం యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ డాక్టర్ మార్కండేయులు గారు 153 వ సారి రక్తదానం చేయడం మాకు సంతోషంగా ఉంది, మేమందరం ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో డాక్టర్ మార్కండేయులు యువతకు ప్రతీ మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవని సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని కూడా చెప్పడం జరిగింది.