oplus_2

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామంలో ఎన్ సి డీ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజలకు ఆరోగ్య కార్యకర్త సులోచన వైద్య పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో 30 సంవత్సరాల నుంచి పైబడిన వారు గ్రామంలో బీపీ,షుగర్ జ్వరాలు వంటివి వస్తే వారికి కావలసిన మందులను అందజేయడం జరుగుతుందని అన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరు పరీక్షలు నిర్వహించుకోవాలని ఆమె సూచించారు.సీజన్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బలరాముడు, ఆశా వర్కర్లు నస్రిన్,పద్మ,లక్ష్మీ, తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *