మన న్యూస్ ,నాయుడుపేట: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటడం అలవాటు చేసుకుని పర్యావరణాన్ని కాపాడాలని మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంపిలుపునిచ్చారు.ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ ఎస్ కే పజిల్లుల్లా ఆధ్వర్యంలో పట్టణంలో ఏ ఎల్ సి ఎం హై స్కూల్ ఆటస్థలంలో జరిగిన పర్యావరణ దినోత్సవం కార్యక్రమంలో మాజీ ఎంపీ,సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతిఒక్కరిపై ఉందని మొక్కలు నాటడం, చెట్లను కాపాడుకోవటం జీవితంలో బాగామవ్వాలని అప్పుడే మనిషికి మనుగడ ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా,మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ రఫీ,పోలేరమ్మ ఆలయ కమిటీ చైర్మన్ నానబాల సుబ్బారావు,తెలుగుదేశం పార్టీ నాయకులు పోట్లపూడి.రాజేష్, కరీంభాయి.చెంచయ్య,మైలారి.రాజశేఖర్,మొండెం బాబు, గూడూరు.సుధీర్ రెడ్డి,అవధానం సుధీర్, పలువురు నాయకులు, మెప్మా సిబ్బంది,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *