రేణిగుంటలో ఇలాంటి టోర్నమెంట్ల నిర్వహణతో స్థానిక యువత ప్రతిభ వెలుగులోకి వస్తుంది :వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్.
యువత క్రీడల వైపు మొగ్గు చూపడం అభినందనీయం: రేవరెండ్ చంద్రన్ డేవిడ్ పాల్.
రేణిగుంట ఆగష్టు 9. తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని రైల్వే ఇన్స్టిట్యూట్ గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు, నిర్వాహకులు కే. మునిరత్నం (బాబు), డాక్టర్ సుధాకర్, ఎ. రెడ్డప్ప, ఎం. దేవాదానం, ఉమా, విజయ్ కుమార్, కే. లోకేష్, ఎస్. చిరంజీవి, కే. రాజేష్, ప్రమోద్, ఎ. శామ్యూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సౌత్ ఇండియన్ 7’స్ ఫుట్‌బాల్ టోర్నమెంట్’ ఆదివారం ఘనంగా ముగిసింది. మొత్తం 18 జట్లు పాల్గొన్నాయి. చివరికి రెండు చెట్లు ఫైనల్ మ్యాచ్ ఆడుతుకు క్వాలిఫై అయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం ఫైనల్ మ్యాచ్‌లో డేవిడ్ అరకోణం, తిరుపతి డైనమోస్ జట్లు తలపడగా, అద్భుత ప్రతిభ కనబరిచి 2 గోల్స్ సాధించిన అరకోణం జట్టు విజేతగా నిలవగా, తిరుపతి డైనమోస్ జట్టు ద్వితీయ స్థానంతో సరిపెట్టుకుంది. విజేత అరకోణం టీమ్‌కు ₹80,000 నగదు, ట్రోఫీ అందజేయగా, రన్నరప్ తిరుపతి డైనమోస్ టీమ్‌కు ₹50,000 నగదు, ట్రోఫీని బహుకరించారు. ఈ ముగింపు వేడుకలకు రేవరెండ్ చంద్రన్ డేవిడ్ పాల్, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్, బిస్లరీ వాటర్ ఏజెన్సీ లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రేవరెండ్ చంద్రన్ డేవిడ్ పాల్ మాట్లాడుతూ యువత క్రీడల వైపు మొగ్గు చూపడం అభినందనీయమని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను, క్రమశిక్షణను ఇస్తాయని పేర్కొనగా, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ రేణిగుంటలో ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించడం వల్ల స్థానిక గ్రామీణ యువతలోని ప్రతిభ వెలుగులోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.




T