నెల్లూరు మూలపేట పాఠశాలను పరిశీలించిన రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ

మన న్యూస్ ,నెల్లూరు :- పాఠశాలను దత్తత తీసుకున్న డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వారిని అభినందించిన మంత్రి – జూన్ 12 లోపు పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశాలు- ప్రభుత్వ తోడ్పాటుతో పాటు దాతల సహకారంతో అభివృద్ధి దిశగా సర్కారు బడులు – మంత్రి నారాయణతో ఫోటోలు తీసుకునేందుకు పోటీపడ్డ విద్యార్థులు, మహిళలు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని మూలాపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదివారం నగరపాలక సంస్థ కమీషనర్ నందన్ తో కలిసి పరిశీలించారు. పాఠశాలలో తరగతి గదుల స్థితిగతులపై ఆరా తీశారు. నిరుపయోగంగా మారిన హెడ్ మాస్టర్ రూం ను మంత్రి పరిశీలించారు. పాఠశాలను దత్తత తీసుకొని ఆధునీకరించేందుకు ముందుకొచ్చిన డీఎస్ఆర్ కనస్ట్రక్షన్స్ వారిని మంత్రి అభినందించారు. ప్రభుత్వ తోడ్పాటుతో పాటు దాతల సహకారంతో సర్కారు బడుల రూపురేఖలు మారనున్నాయని మంత్రి తెలియజేశారు. ఈ సందర్భంగా డీఎస్ఆర్ కనస్ట్రక్షన్స్ ప్రతినిధులకు మంత్రి నారాయణ పలు సూచనలు చేశారు. పాఠశాలలో పది తరగతి గదులు, ల్యాబ్ & మ్యూజిక్ రూములు, ప్లే గ్రౌండ్ పనులు తొలుత ప్రారంభించాలని మంత్రి వారికి సూచించారు. జూన్ 12 కల్లా పెయింట్లతో సహా పనులు పూర్తి అయ్యే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. నిరుపయోగంగా ఉన్న హెడ్ మాస్టర్ రూం ని తొలగించాలని సూచించారు. ఈ క్రమంలో మూలపేట పాఠశాలను పరిశీలించేందుకు వచ్చిన మంత్రికి స్థానిక ప్రజలు టిడిపి శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి నారాయణతో ఫోటోలు దిగేందుకు విద్యార్థులు, మహిళలు ఉత్సాహంగా పోటీపడ్డారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ ..డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, స్థానిక టీడీపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా