వరి ధాన్యం కనీస మద్దతు ధర పెంపుపై కేంద్ర ప్రభుత్వం పునః పరిశీలన చేసి ,పెట్టుబడి ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధర పెంచాలి………. తెలుగుదేశం నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి

మన న్యూస్, కోవూరు,మే30:*వరి ధాన్యం కనీస మద్దతు ధర పెంపు పై, కేంద్ర ప్రభుత్వం పునః పరిశీలన చేసి పెట్టుబడి ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధర పెంచాలి.*గత ఏడాది క్వింటాలుకు రూ.117 పెంచిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కేవలం రూ.69 మాత్రమే పెంచింది.*ప్రతి ఏడాది పెట్టుబడి ఖర్చులు 10 శాతం నుండి 15 శాతం పెరుగుతుంటే మద్దతు ధర కేవలం 3 శాతం మాత్రమే పెంచారు.*రైతాంగానికి ఎన్నో విధాలుగా ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ధాన్యం మద్దతు ధరపై పునః పరిశీలన చేసి, ధాన్యం మద్దతు ధర పెంచి రైతులను ఆదుకోవాలి .కోవూరు లో శుక్రవారం తన కార్యాలయం లో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖర్ల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ*………..కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు 2025-26 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 14 పంటలకు కనీస మద్దతు ధరను(M S P) ప్రకటించింది అని అన్నారు.పప్పు ధాన్యాలు మరియు ఇతర పంటలకు సంబంధించి ప్రకటించిన మద్దతు ధర ను 5 శాతం నుండి 10 శాతం వరకూ పెంచారు.కానీ రాష్ట్రంలో అత్యధికంగా పండించే వరి ధాన్యం కు మద్దతు ధరను కేవలం 3 శాతం మాత్రమే పెంచారు అని అన్నారు.గత ఏడాది క్వింటాలుకు రూ.117 పెంచిన కేంద్ర ప్రభుత్వం, ఈ ఏడాది కేవలం రూ.69 మాత్రమే పెంచింది అని అన్నారు.గత ఏడాది వరి సాగు ఖర్చు ఎకరానికి 30 వేలు ఖర్చు అయితే,ఈ ఏడాది విత్తనాలు, ఎరువులు,పురుగు మందుల,కూలీల ఖర్చులు పెరిగి దాదాపు 40 వేలు వరకూ ఖర్చు అవుతుంది అని అన్నారు.అయితే వరి ధాన్యం కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర పెరిగిన పెట్టుబడులు ఖర్చులకు అనుగుణంగా లేదు అని అన్నారు.కొన్ని అధ్యయనాల ప్రకారం ఒక క్వింటాలు వరి ధాన్యం ఉత్పత్తి కి జాతీయ సగటు వ్యయం రూ.3135 కాగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర రూ.2369 మాత్రమే అని అన్నారు.రైతులు ఆరుగాలం శ్రమించి పంటలు పండించి నప్పటికీ,పకృతి వైపరీత్యాలు,అకాల వర్షాలు లాంటి వాటి వలన పండించిన పంట చేతికి వచ్చే వరకూ గ్యారెంటీ లేదు.రైతు బ్రతుకు గాలిలొ దీపం లాంటిది అని అన్నారు.దేశంలో రైతాంగానికి ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర విషయంలోనూ ఉదారంగా వ్యవహరించి రైతాంగాన్ని ఆదుకోవాలి అని అన్నారు.కేంద్ర ప్రభుత్వం వాస్తవిక పరిస్థితులను,స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని, వరి ధాన్యం కు ప్రకటించిన కనీస మద్దతు ధర పై పునఃపరిశీలన చేసి కనీస మద్దతు ధరను క్వింటాలుకు మరో రూ.300 అన్నా పెంచి ధాన్యం పండించే రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…