మన న్యూస్, బుచ్చిరెడ్డిపాలెం, మే 29:- కోవూరు నుంచి 100 కార్లు, 30 బస్సుల్లో మహానాడుకు పయనం- బుచ్చిరెడ్డిపాలెంలో జెండా ఊపి వాహనాలను ప్రారంభించిన ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ – గొప్ప నాయకులతో కలిసి ప్రయాణం చేయడం అదృష్టం కోవూరు నియోజకవర్గం పసుపుమయమైంది. మహానాడుకు బయలుదేరుతున్న నాయకులు, కార్యకర్తలతో సందడి వాతావరణం నెలకొంది. బుచ్చిరెడ్డిపాలెంలో మహానాడుకు బయలుదేరుతున్న బస్సులను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దంపతులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ……… తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం, భవిష్యత్తు అని అన్నారు. కార్యకర్తల గుండెల్లో స్థానం సంపాదించుకున్న సీఎం చంద్రబాబు నాయుడు , లోకేష్ తో కలిసి పనిచేయడం అదృష్టన్నారు. యువతకు ప్రాధాన్యతనిస్తూ నారా లోకేష్ పార్టీని ముందుకు నడిపిస్తున్నారన్నారు. మహానాడుకు గత రెండు రోజులుగా భారీ సంఖ్యలో కార్యకర్తల హాజరయ్యారని, అనేక అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , లోకేష్ కార్యకర్తలకు దిసానిర్దేశం చేశారన్నారు. నేడు భారీ బహిరంగ సభ నేపథ్యంలో కోవూరు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు కడప మహానాడుకు తరలివస్తున్నారన్నారు. 100 కార్లు 30 బస్సుల్లో మహానాడుకు వస్తున్నారన్నారని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మహానాడుకు చేరుకోవాలని, కార్యక్రమం అనంతరం తిరిగి జాగ్రత్తగా వారి వారి స్వస్థలాలకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *