రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఆలోచనలకు అనుగుణంగా విఆర్ హై స్కూల్ రూపు రేఖలు

మన న్యూస్, నెల్లూరు ,మే 29:- నెల్లూరు విఆర్ హైస్కూల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు షరణి – మా నాన్న ఉన్నత స్థితికి విఆర్ హైస్కూల్లో చదువుకోవడమే పునాది- ప్రతి తరగతి గదిలో డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు – ఇంటర్నేషనల్ స్థాయిలో ప్లే గ్రౌండ్ – అనుభవం మెలకువలు తెలిసినా ఉపాధ్యాయులు ఎంపిక – సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చిన మంత్రి కుమార్తె పొంగూరు షరణిభవిష్యత్ తరాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆలోచనలకు అనుగుణంగా వి ఆర్ హై స్కూల్ ను ఇంటర్నేషనల్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి నారాయణ కుమార్తె పొంగూరు షరణి తెలియజేశారు. నెల్లూరు విఆర్ హైస్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ అభివృద్ధి పనులను ఆమె క్షేత్రస్థాయిలో ఎన్సిసి సిబ్బందితో కలిసి పరిశీలించారు. హై స్కూల్ లోని ప్రతి తరగతి గదికి వెళ్లి జరుగుతున్న అభివృద్ధి పనులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ప్రతి తరగతి గదిలో ఏర్పాటు చేసిన 86 ఇంచెస్ డిజిటల్ స్క్రీన్ లను స్వయంగా పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న ల్యాబ్స్ ను తనిఖీ చేశారు. అధునాతన హంగులతో తీర్చిదిద్దుతున్న క్రీడా మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె పొంగూరు షరణి మాట్లాడుతూ విఆర్ హైస్కూల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రతిరోజు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. గత కొన్ని రోజులుగా విఆర్ హైస్కూల్లో అభివృద్ధి పనులు శరవేగంగా నాణ్యతా ప్రమాణాలతో జరుగుతున్నాయని తెలిపారు. మా నాన్న ఈ స్కూల్లో చదివారని అయితే అప్పట్లో సరైన వసతులు లేవన్నారు. కానీ ఈరోజు మా నాన్న ఈ స్థాయికి రావడానికి విఆర్ స్కూల్లో చదువుకోవడమే పునాది అని షరణి చెప్పారు. ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్న కాబట్టి తాను చదువుకున్న స్కూల్ కి ఏదో ఒకటి చేయాలని మంత్రి నారాయణ మహా సంకల్పానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఆ విధంగా అధునాతన హంగులతో విఆర్ హై స్కూల్ ను తీర్చిదిద్దాలన్న బాధ్యతను తనపై ఉంచారన్నారు. గడిచిన నెల రోజులుగా ఎంతో పట్టుదలతో మంత్రి నారాయణ ఆశయాలకు అనుగుణంగా ఎన్సీసీ వారు ఇక్కడ అభివృద్ధి పనులను శరవేగంగా చేపడుతున్నారని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన అర్థవంతమైన విద్యను అందించేందుకు ప్రత్యేక ప్రణాళికతో విఆర్ హై స్కూల్లో ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 86 ఇంచెస్ స్క్రీన్ తో ఏర్పాటు చేసిన ప్రత్యేక తరగతి గదులు విద్యార్థులను ఎంతగానో ఆకర్షించడంతోపాటు చదువు పట్ల ఆసక్తి చూపేలా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా వీఆర్ హై స్కూల్లో నూతన టెక్నాలజీకి అనుగుణంగా అన్ని రకాల సబ్జెక్టులకు సంబంధించి ల్యాబ్స్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని తెలిపారు. మా నాన్న ఆలోచనకు అనుగుణంగా వీఆర్ హై స్కూల్లోని అన్ని తరగతుల గదులలో డిజిటల్ స్క్రీన్స్ ద్వారా విద్యా బోధన చేపడుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ స్థాయిలో క్రీడా ప్రాంగణాన్ని రూపొందిస్తున్నట్లు పొంగూరు షరణి తెలిపారు. ఏదేమైనా పేదవిద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఇంటర్నేషనల్ స్థాయిలో వీఆర్ హైస్కూల్ ను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. స్టీమ్ విధానం ద్వారా విద్యార్థులకు అన్ని సబ్జెక్టులలో అర్థమంతమైన విద్య బోధన చేయనున్నట్లు చెప్పారు. అదేవిధంగా హైడ్రో ఫోనిక్స్ టెక్నాలజీని వీఆర్ హైస్కూల్లో ప్రత్యేకంగా ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయుల ఎంపిక సైతం శరవేగంగా జరుగుతుందన్నారు. ఒకప్పుడు వి ఆర్ హైస్కూల్ ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉండబోతుందో చేసి చూపించబోతున్నామని పొంగూరు షరణి తెలిపారు.

  • Related Posts

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్ 12 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెనుకబడిన తరగతులైన బీసీలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను వెంటనే అమలు పరచాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్ డిమాండ్ చేశారు. ఈరోజు బీసీల 5 ప్రధాన డిమాండ్ల…

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 7 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//