మన న్యూస్, కడప /నెల్లూరు, మే 27:తెలుగుదేశం పార్టీ తరపున సేకరించిన విరాళాలు పార్టీ కోసమే కాకుండా, పేదలు, పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మహానాడు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందించిన విరాళాన్ని మంగళవారం సీఎం చంద్రబాబు సభలో ప్రస్తావించారు. మహానాడు తొలిరోజు ప్రకటన చేయగానే స్పందించి రూ.17 కోట్లకు పైగా విరాళాలు అందించిన టీడీపీ నేతలను ఆయన అభినందించారు. పార్టీ పట్ల ప్రేమ ప్రజల పట్ల నిబద్ధతకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విరాళం నిదర్శనం. ఎంపీగా గెలిచినప్పటి నుంచి పార్టీకి మద్దతుగా నిలిచిన .. తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడుకు విరాళామందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *