మన న్యూస్ ,నెల్లూరు, మే 27:కావలి లో జర్నలిస్టుల పై అక్రమ కేసులు పై విచారణ చేసి న్యాయం చేయాలని జిల్లా జేసీ కార్తీక్ కు వినతిపత్రం సమర్పించిన JAC. నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ JAC ఆద్వర్యం లో జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ ను కలిసిన జర్నలిస్టు లు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు అంతకంతకు పెరిగిపోతున్నాయని,కావలి పట్టణం లో 2020 వ సంవత్సరం లో అమృత పైలాన్ ధ్వంసం కేసు రీ ఓపెన్ చేసి ఆ ఘటనకు సంబంధం లేని 7మంది జర్నలిస్ట్ లపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి వారిలో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు,జర్నలిస్ట్ లు సమాజ హితం కోసం సమాజం లో జరిగే సమస్యలు పరిష్కారం కోసం ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే ఒక విభాగం,ఇలాంటి జర్నలిస్ట్ వ్యవస్త పై దాడులు చేయడం,దౌర్జన్యాలు,అరెస్ట్ లు చేయడం బాధాకరం,కావలిలో జరిగిన ఈ సంఘటన పై విచారణ చేసి జర్నలిస్ట్ లకు న్యాయం చేయగలరని అలాగే ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయగలరని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కు జర్నలిస్ట్ JAC సభ్యులు వినతి పత్రం సమర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *