

గాండ్ల సాధికారత సమితి నేత జగన్నాథం
Mana News :- తిరుపతి, నవంబర్ 21, (మన న్యూస్ ) తిరుపతిలో నివసిస్తున్న స్థానికులకు ప్రతినెల మొదటి మంగళవారం .. శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడం ఆనందదాయకమని .. గాండ్ల సాధికారత సమితి, టీడీపీ బీసీ సాధికార కమిటీ సభ్యులు జగన్నాథం హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు జగన్నాథం బిసి కుల సంఘాల నాయకులు రామారావు , చంద్రమోహన్ తదితరులతో కలిసి మాట్లాడుతూ.. తమకూటమి పాలనలో రాష్ట్రంలో అన్ని ప్రజారంజకంగా పాలన కోన సాగుతున్నది కొనియాడారు.