మన న్యూస్ ,నెల్లూరు, మే 23: నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కనుపర్తిపాడు లోని వి పి ఆర్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం తెలుగుదేశం పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన నెల్లూరు పార్లమెంట్ మహానాడు ఘనంగా జరిగింది.ఈ మహానాడు కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున ప్రతినిధులు పాల్గొని ఈ మహానాడును విజయవంతం చేశారు.ఈ మహానాడుకు ముఖ్య అతిథులుగా గౌరవ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు,శాసనసభ్యులు నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు, వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు,మాజీ శాసనసభ్యులు,కార్పొరేషన్ చైర్మన్ లతో పాటు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.వివిధ నియోజకవర్గ మహానాడులో చేసిన తీర్మానాల పై చర్చించడం తో పాటు,ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలనే తీర్మానం తో పాటు జిల్లాకు సంబంధించి 10 తీర్మానాల ఈ మహానాడులో చర్చించి ఆమోదించడం జరిగింది.పహాల్గం ఉగ్రదాడి లో మరణించిన వారికి,ఆపరేషన్ సింధూర్ లో మరణించిన వీర జవాన్ లతో పాటు.గత ఏడాదిగా మరణించిన వారికి మహానాడు లో సంతాపం తెలియచేయడం జరిగింది.ఈ మహానాడు నిర్వహణలో అనేక మంది నాయకులు శ్రమించారు.వారందరికీ కృత్ఞతలు.ముఖ్యంగా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు కు ప్రత్యేక ధన్యవాదములు.ఈ మహానాడు విజయవంతం కావడానికి అన్నివిధాలుగా సహకరించిన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డీ ప్రభాకర రెడ్డి కి ప్రత్యెక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *