మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ ) మహమ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంత్ రావు ఆదేశాల మేరకు బూర్గుల్ గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు అందరి సమక్షంలో గ్రామ కమిటీని ఎన్నుకోవటం జరిగింది.గ్రామ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి,ఉపాధ్యక్షులుగా సాయగౌడ్ ను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నుకోవటం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వారికి ఫలితం ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీని మరింత ప్రతిష్టంగా చేపట్టే విధంగా పనిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సవాయి సింగ్, లోక్యనాయక్,నాగభూషణం గౌడ్,ఖలీక్,మల్లయ్య గారి ఆకాష్,తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *