కొండాపురం, అక్టోబర్ 5 (మన న్యూస్,RC ఇన్చార్జి నాగరాజు)
మానవత్వమే పరమావధిగా, పేద ప్రజలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న కోడే వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది.ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం కొమ్మి గ్రామంలోని హరిజనవాడకు చెందిన యారాం చిన్నమ్మ అనే నిరుపేద మహిళ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ట్రస్ట్ సభ్యులు చెరుకూరి నవీన్ వెంటనే స్పందించారు. ఆదివారం ఆమె నివాసానికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పరామర్శించారు. అనంతరం వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణ ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
*సేవే లక్ష్యంగా ట్రస్ట్ కృషి:ఈ సందర్భంగా చెరుకూరి నవీన్ మాట్లాడుతూ… పేద, నిరుపేద ప్రజలకు అండగా నిలవాలనే సంకల్పంతో తమ తాతగారైన కీ.శే. కోడే వెంకటరావు పేరిట ఏర్పాటు చేసిన ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. కొమ్మి గ్రామంలో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా, అనారోగ్య సమస్యలు వచ్చినా ట్రస్ట్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.ట్రస్ట్ చేస్తున్న సేవలకు గ్రామస్తులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిస్వార్థంగా పేదలకు సాయం అందిస్తున్న చెరుకూరి నవీన్ ని పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో కొమ్మి గ్రామ కమిటీ అధ్యక్షులు దేవినేని వెంకటసుబ్బయ్య, బూత్ ఇన్‌చార్జీలు చెరుకూరి శేషయ్య, శ్రీను, చెరుకూరి వెంకయ్య, కొండలరావు తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
