

మన న్యూస్: పినపాక రైతు వేదికలో బుధవారం ఐటిసి ఎం ఎస్ కే, మైరాడ ఎన్జీవో వారి ఆధ్వర్యంలో అగ్రి బిజినెస్ సెంటర్ (ఏ బి సి) రైతులకు సుస్థిర వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మైరాడ సోషల్ మొబలైజర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ సీడ్ డ్రిల్లర్, డ్రమ్ సీడర్ ద్వారా రైతులు కరివేద వేయడం వలన కలిగే ప్రయోజనాలు వివరించారు. తక్కువ పెట్టుబడి, కొద్దిపాటి నీటితో వ్యవసాయం ఎలా చేయాలి అనే విషయంపై రైతులకు మెలుకువలు నేర్పించారు. రైతులు పంట మార్పిడి విధానం పాటించాలని తద్వారా నేలలో హ్యూమస్ పొర సమృద్ధి చెందుతుందని, రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతులు వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపి అధిక ఆదాయం పొందాలని సూచిన చేశారు. ఈ కర్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి రమేష్ , రైతులు ఇర్ప రామనాదం , సోంబోయిన కృష్ణ, భీమరాజు, సాంబశివరావు, అరె శంకరయ్య , కళ్యణ మహేశ్వరావు, మైరాడ సొసైల్ మొబైలైజర్ నాగేశ్వరావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.