మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ఏలేశ్వరం ప్రింట్ మీడియా సంఘం ఆర్థిక సహకారంతో,వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో సోమవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో ఆసుపత్రి చైర్మన్ వాగు రాజేష్,ప్రింట్ మీడియా సభ్యులు,టిడిపి నాయకులు బుగతా శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ రాజేష్ మాట్లాడుతూ వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతి సోమవారం మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ సోమవారం ఏలేశ్వరం ప్రింట్ మీడియా సంఘం ఆర్థిక సహకారంతో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు ఆయన మీడియా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.అలాగే దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు,ప్రింట్ మీడియా సభ్యులు, వివేకానంద సేవా సమితి సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *