

మన న్యూస్, నెల్లూరు, మే 18 :నెల్లూరు, స్టోన్ హౌస్ పేట ,పప్పుల వీధి ఎస్బిఎస్ కళ్యాణ మండపంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125 వ జయంతి ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ , పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆర్యవైశ్య ప్రముఖులు తది తరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ…….రాజధానిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేస్తాము అన్ని అన్నారు.రాజధాని అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహానికి సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి 16 వరకు అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు నిర్వహిస్తూ ఉండడం సంతోషంగా ఉందన్నారు. నెల్లూరు నగరంలోని పప్పుల వీధి ఎస్బిఎస్ కళ్యాణ మండపంలో శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమరజీవి 125వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి అయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. ముందుగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలు వేసి ఆయన నివాళులర్పించారు.. అనంతరం మంత్రి నారాయణను వ్యాపార సంఘాలు ఘనంగా సన్మానించారు.. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన అమరజీవి ఏవి జీవిత చరిత్ర అందర్నీ ఆకట్టుకుంది.. మంత్రి నారాయణ మాట్లాడారు అమరజీవి జయంతి ఉత్సవాలు 2025 మార్చి 16 నుండి 2026 మార్చి 16 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.. అమరజీవి గాందే వాదని తెలిపారు. మూడుసార్లు జైలుకు కూడా వెళ్లారని.. తెలుగు రాష్ట్రం కోసం 58 రోజుల నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన మహనీయులైన కొనియాడారు.. దళితుల ఆలయ ప్రవేశం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అని.. అన్ని తరాలు గుర్తుపెట్టుకోవాల్సిన త్యాగశీలి అని ఆయన తెలిపారు.. అందులో ఆయన నెల్లూరు జిల్లా వాసి కావడం మనకెంతో గర్వకారణం అని తెలిపారు.. రాజధాని లో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు.. 22 ఎకరాల్లో ఇండియాలో బెస్ట్ మార్కెట్ను తొమ్మిదో డివిజన్లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.. ఆ మార్కెట్ కూడా పొట్టి శ్రీరాములు మార్కెట్ గా నామకరణం చేస్తారని ఆయన హామీ ఇచ్చారు.. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులందరూ మంత్రి నారాయణ కు కృతజ్ఞతలు తెలిపారు.
