

మన న్యూస్, సర్వేపల్లి, మే 18:*ఐదేళ్ల తర్వాత రైతులకు మళ్లీ సబ్సిడీపై పరికరాలు.*రూ.2 లక్షలకే రూ.10 లక్షల విలువైన డ్రోన్.*జూన్ నుంచి అన్నదాత సుఖీభవ…అర ఎకరం ఉన్న రైతుకు కూడా రూ.20 వేలు.*ప్రతి రైతు 20వ తేదీ లోపు సచివాలయానికి వెళ్లి అన్నదాత సుఖీభవ జాబితాలో పేరును నమోదు చేసుకోవాలి.తోటపల్లి గూడూరు మండలం వరిగొండలో ఆదివారం రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ…………..వైసీపీ ఐదేళ్ల పాలనలో వ్యవసాయ శాఖతో పాటు యాంత్రీకరణ పథకాన్ని కూడా మూసేశారు అని అన్నారు.టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ శాఖ తిరిగి గాడిలో పడింది అని అన్నారు.గత ప్రభుత్వం మూలన పెట్టిన పథకాలన్నింటిని మా ప్రభుత్వం తిరిగి గాడిలో పెడుతోంది అని అన్నారు.నెల్లూరు జిల్లాలో రూ.3.25 కోట్లతో 1451 మంది రైతులకు పవర్ స్ర్పేయర్లు, బ్రష్ కట్టర్లు, కల్టివేటర్లు, రొటావేటర్లను రైతులకు సబ్సిడీపై అందజేశారు.80 శాతం సబ్సిడీ డ్రోన్లు పంపిణీ చేసే కార్యక్రమానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని తెలిపారు.రూ.10 లక్షల విలువైన డ్రోన్ ను రూ.8 లక్షలు సబ్సిడీ పోను కేవలం రూ.2 లక్షలకే అందిస్తోంది అని అన్నారు.జిల్లాలో రూ.4.10 కోట్ల విలువైన 41 డ్రోన్లను అందించబోతున్నారు. ఇందులో రూ.3.28 కోట్ల సబ్సిడీ లభించనుంది అని అన్నారు.గత ప్రభుత్వం మూసేసిన వ్యవసాయ శాఖతో పాటు ఇరిగేషన్ శాఖను కూడా గాడిలో పెట్టాం అని అన్నారు.అన్నదాత సుఖీభవ పథకాన్ని జూన్ నుంచి మన ప్రభుత్వం అమలు చేయబోతోంది అని అన్నారు.గతంలో కేంద్ర ప్రభుత్వం రూ.6 వేలు ఇస్తే, జగన్ రెడ్డి రూ.7 వేలు రాష్ట్ర నిధులు కలిపి రూ.13 వేలను రైతు భరోసాగా రైతులకు అందించారు .టీడీపీ కూటమి ప్రభుత్వం కేంద్రం రూ.6 వేలకు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.14 వేలు కలిపి ప్రతి రైతుకు రూ.20 వేలు అందించబోతోంది అని అన్నారు.జూన్ లోనే తల్లికి వందనం కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు అని తెలిపారు.ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుంది అని తెలిపారు.గత ప్రభుత్వం చేసిన పాపాల కారణంగా రాష్ట్రం ఆర్థికంగా కుదేలైపోయింది అని అన్నారు.ఈ పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెడుతోంది అని అన్నారు.ప్రతి రైతు సచివాలయానికి వెళ్లి అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల జాబితాను పరిశీలించుకోండి…మీ పేర్లు లేకపోతే మే 20వ తేదీ లోపు నమోదు చేయించుకోండి అని అన్నారు.అర ఎకరా పొలం ఉన్నా అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేలు అందనుంది అని అన్నారు.అధికారులతో పాటు కూటమి పార్టీల నాయకులందరూ రైతులకు అవగాహన కల్పించి అన్నదాత సుఖీభవను సద్వినియోగం చేసుకునేలా చైతన్యం చేయాలి అని అన్నారు.
