మన న్యూస్, కోవూరు ,మే 15:తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో, మంత్రివర్యులు నారా లోకేష్ యువనాయకత్వంలో, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రోత్సాహంతో, నెల్లూరు జిల్లా అధ్యక్షులు అబ్దుల్‌ అజీజ్‌ ఆధ్వర్యంలో కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా మండలాల అధ్యక్షులను ప్రకటించడం జరిగింది. ఇక ఆయా మండలాలకు కింద పేర్కొన్న వ్యక్తులు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులుగా పరిగణించబడతారు. పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైనకి మా హృదయపూర్వక అభినందనలు. పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన వారు తమ శక్తి వంచన లేకుండా పనిచేయాలని, కార్యకర్తలను నాయకులను కలుపుకొని ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగాలని మనసారా కోరుకుంటున్నాను. అలాగే ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల చెంతకు చేర్చేలా కృషి చేయాలని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు మండల అధ్యక్షులుగా పనిచేసిన వారి సేవలకు సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాత, కొత్త నాయకులందరూ సమన్వయంతో కలిసికట్టుగా పని చేసి ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తీసురావాలని ఆకాంక్షిస్తున్నాను.కోవూరు మండలం : కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి ,బుచ్చి అర్బన్ : గుత్తా శ్రీనివాసులు బుచ్చి రూరల్ మండలం : బెజవాడ జగదీష్ ,బుచ్చి మండల గౌరవాధ్యక్షులు : టంగుటూరి మల్లారెడ్డి ,ఇందుకూరుపేట మండలం : యేకొల్లు పవన్ రెడ్డి కొడవలూరు మండలం : నాపా వెంకటేశ్వర్లు నాయుడు విడవలూరు మండలం : యెటూరు శ్రీహరి రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *