

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) కొత్త చట్టం భూ భారతితో రైతులకు మేలు జరుగుతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో భూ భారతి పై రెవెన్యూ సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట మాట్లాడుతూ..గడిచిన కాలంలో భూమి కోసం పోరాటాలు జరిగాయని వివరించారు.భూముల వివరాలు కాగితాలపై ఒక లెక్క,ఫిజికల్ గా మరో లెక్క ఉండేవన్నారు.రైతుల సమస్యలు పరిష్కరించడానికి భూ భారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు.జియో ట్యాగింగ్ చేసి భూదార్ కార్డు జారీచేయడం జరుగుతుందని తెలిపారు.సాధాబైనామా దరఖాస్తులను పరిశీలించి విచారణ చేసి న్యాయం చేయడం జరుగుతుందని అన్నారు.ధరణీ వలన రైతుల ప్రాణాలు పోయాయని తెలిపారు.ఎవరి భూమి వారికే చెందడానికి భూ భారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు.కొత్త చట్టాన్ని ప్రతీ ఒక్కరు అవగాహన కల్పించుకోవాలని, సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.జుక్కల్ నియోజక వర్గంలో దళారుల ప్రమేయం ఉండకూడదని,అలా చేసిన పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ను కోరారు.ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో అవకతవకలు జరగకూడదని పేర్కొన్నారు.
ఆయా అవగాహన సదస్సులలో పలువురు రైతులు ప్రసంగించారు.అంతకుముందు చట్టం పై రూపొందించిన వివరాలను ఆయా తహసీల్దార్లు వివరించారు.ఈ కార్యక్రమంలోవ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్,మండల ప్రత్యేక అధికారిని ప్రమీల,నిజాంసాగర్,మొహమ్మద్ నగర్ మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,రవీందర్ రెడ్డి,తహసీల్దార్ లు బిక్షపతి,సవాయి సింగ్,ఎంపిడిఓ గంగాధర్,అనిత,మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్,మహమ్మద్ నగర్ మండల వ్యవసాయ అధికాణి నవ్య,రైతులు నాయకులు తదితరులు ఉన్నారు.


