రాష్ట్రాన్ని సాధించిన పార్టీ, తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పాలనలో సకలజనులు సంతోషంగా ఉన్నారు.బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు పార్టీ జెండాను ఎగురవేసిన

మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా జిల్లా గద్వాల జిల్లా నియోజకవర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ,అలంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే విజయుడు భారీ సంఖ్యలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన పార్టీ, సకలజనులకు సంపూర్ణ సంక్షేమాన్ని అందించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఎమ్మెల్యేలు అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకొని పార్టీ కార్యాలయ ఆవరణలో గులాబీ జెండాను ఎగరవేసిన అనంతరం మాట్లాడారు. తెలంగాణ ప్రజల చిరకాల వంచను నెరవేర్చి, ప్రత్యేక రాష్ట్రాలు సాధించిన ఘనత విఆర్ఎస్ పార్టీకి దక్కిందని ఎమ్మెల్యేలు అన్నారు. స్వరాష్ట్రంలో కెసిఆర్ పాలనలో అభివృద్ధిలోనే రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపామని అన్నారు. కెసిఆర్ పాలన తీరు దేశానికి ఆదర్శంగా నిలిచిందని, సకలజనులకు సంక్షేమ అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, బీసీ బందు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కెసిఆర్ కిట్లు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజల అభివృద్ధికి దోహదపడ్డాయని అభిప్రాయపడ్డారు. కెసిఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. టిఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ అని, ఎప్పటికైనా తెలంగాణ ప్రజల బాగోగులను చూచే ఏకైక పార్టీ గులాబీ పార్టీ అని అన్నారు. తెలంగాణ ప్రజల పార్టీ రజతోత్సవ వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని, రజతోత్సవాన్ని తెలంగాణ ప్రజలు పండుగల భావిస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే వరంగల్లో నిర్వహిస్తున్న రజోత్సవ వేడుకలకు నియోజకవర్గం నుంచి వేలాది మంది కార్యకర్తలు తరలి వెళ్లారు. సభకు వెళ్తున్న వాహనాలకు ఎమ్మెల్యేలు జెండాను ఊపి స్వాగతం పలికారు. ప్రతి పల్లె నుంచి గులాబీ దండు వరంగల్ సభకు తరలివచ్చారని ఈ సందర్భంగా పలువురు నాయకులు చెప్పారు.ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *