తిరుపతిలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు,,పళ్ళచోట్ల అన్నదాన కార్యక్రమాలు..

మనన్యూస్,తిరుపతి:రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను తిరుపతిలో తెలుగుదేశం, జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు టిడిపి అభిమానులు ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల చంద్రబాబు పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు అన్నదాన కార్యక్రమాలు పార్టీ నాయకులు నిర్వహించారు. టౌన్ క్లబ్ సర్కిల్, శ్రవణం ప్రాజెక్టు, ఆర్టీసీ బస్టాండ్, ముత్యాల రెడ్డి పల్లి సర్కిల్, వైకుంఠపురం ఆర్చ్,అలిపిరి గోశాల, టిడిపి తిరుపతి పార్లమెంట్ కార్యాలయం తో పాటు పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు పార్టీ నాయకులు నిర్వహించారు. కూటమి పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టిడిపి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ లు మాట్లాడుతూ భారతదేశ రాజకీయాల్లోనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక లెజెండ్ అని కొనియాడారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉండాలని మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని వారు కోరారు. దేశంలోనే గొప్ప పరిపాలన దక్షిత కలిగిన గొప్ప మహా నాయకుడు అని, మరో 20 ఏళ్లు రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేలా ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు తప్పించే గొప్ప నాయకుడు అన్నారు. ఆయన ముందు చూపు వల్లే హైదరాబాదు, సైబరాబాద్ దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. తిరుపతి తో ఆయనకు ఎంతో విడదీయ రాని బంధం ఉందని, తిరుపతిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత ఒక చంద్రబాబుకే దక్కుతుందన్నారు. చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పుట్టడం రాష్ట్రానికే కాదు దేశానికి వరమని పేర్కొన్నారు. దేశానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని, వ్యవసాయ రంగానికి టెక్నాలజీని పరిచయం చేశారన్నారు. ఆయన ఆశయాలు దృక్పథం ఈతరం నాయకులకు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. ఈ జన్మ దిన వేడుకలలో టిడిపి రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, శాప్ చైర్మన్ రవి నాయుడు,పుష్పావతి యాదవ్, బుల్లెట్ రమణ, పులిగోరు మురళీకృష్ణారెడ్డి, ఊకా విజయకుమార్,రుద్రకోటి సదాశివం, ఒట్టి కుంట చిన్నబాబు, ఆర్ సి మునికృష్ణ, కంకణాల రజనీకాంత్ నాయుడు, నైనార్ మహేష్ యాదవ్, జనసేన రాజారెడ్డి, సింగంశెట్టి సుబ్బరామయ్య,
బి జె కృష్ణ యాదవ్,యశ్వంత్ రెడ్డి, శంకర్ యాదవ్, చెంపకూరు రాజయ్య, మునస్వామి, ఊట్ల సురేంద్ర నాయుడు,పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు