

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్):ఏలేశ్వరం పట్టణంలోని క్రైస్తవ సంఘాలు శనివారం ఉదయం 7 గంటల నుండి బాలాజీ చౌక్ సెంటర్ నుండి లింగవరం కాలనీ వరకు రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా రన్ ఫర్ జీసస్ కోఆర్డినేటర్ జోసఫ్ ఆండ్రూస్,మండల యునైటెడ్ ఫెలోషిప్ అధ్యక్షులు ఎం సత్యానందంలు మాట్లాడుతూ రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమంలో మండలంలో క్రైస్తవ సంఘాల
నుంచి సుమారు 1000 మంది వరకు యవ్వనస్తులు,వృద్ధులు,మహిళలు పాల్గొని తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని జండాలతో రన్ ఫర్ జీసస్ అంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి క్రైస్తవుడికి ప్రభువైన ఏసుక్రీస్తు కృప వారిపై ఉంటుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంటాట ప్రోగ్రాం కోఆర్డినేటర్ జాయ్ కుమార్, ఇమ్మానియేల్,జాషువా డానియల్, ఎలీషా,అబ్రహం,సుజ్ఞాన రావు తదితర క్రైస్తవ సంఘాలు,సంఘ కాపరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.