మన న్యూస్,ఎస్ఆర్ పురం:-వెన్నెముక సమస్య అనారోగ్యంతో బాధపడుతున్న టిడిపి కార్యకర్త ను మంగళవారం సమాచారం అందుకున్న చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద్ రావు వెన్నుపూస సమస్యతో బాధపడుతూ… ఇటీవలే కోలుకున్న బాధితుడ్ని పరామర్శించారు. వివరాలు ఇలా… చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో పెనుమూరు మండలం పులికల్లు గ్రామపంచాయతీ గొడుగుమానుపల్లి గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త నెల్లెపల్లి నాధముని వెన్ను ముక్క సమస్యతో గత ఆరు నెలలుగా మంచానికి పరిమితమై కొంచెం కొంచెం ఆరోగ్యం కుదురుటపడుతూ ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నారు. స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.ఆయన ఇంటికి వెళ్లి ఆరోగ్య విషయాలని అడిగి తెలుసుకున్నారు అధైర్య పడవద్దని చెప్పి మనోధైర్యాన్ని కల్పించారు మీ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రుద్రయ్య నాయుడు, గంధమనేని రాజశేఖర్ నాయుడు, శ్రీధర్ యాదవ్ ,కోదండ యాదవ్ ,సూరి రెడ్డి ,ప్రసాద్ యాదవ్ రమేష్ కోదండపాణి దిలీప్ కుమార్ ,పట్టాభి, రవి ,గిరి ,నరేష్, హేమాద్రి ,షణ్ముఖ వర్మ , బాలాజీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *