మన న్యూస్ శంఖవరం (అపురూప్)

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎఫ్ఎసి)గా ఎన్ఎమ్ కెజి ప్రసాద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు శంఖవరం ఎంపిడిఓగా పనిచేసిన ఎస్ సుబ్రహ్మణ్య శర్మ సామర్లకోట లోని ఈటిసికు బదిలీపై వెళ్ళారు. సుబ్రహ్మణ్య శర్మ శంఖవరం మండలంలో సుమారు 8 నెలల కాలం పాటు పనిచేసారు. నూతన ఎంపిడిఓగా బాధ్యతలు చేపట్టిన ప్రసాద్ శంఖవరం మండల పరిషత్ పరిపాలనాధికారిగా గత కొంతకాలంగా పనిచేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే సుబ్రహ్మణ్య శర్మ బదిలీ కావడంతో ఎఓ ప్రసాద్ కు పూర్తి అదనపు బాధ్యతలతో కూడిన ఎంపిడిఓగా పదోన్నతి లభించింది. దీనితో పలు శాఖల సిబ్బంది ఎంపిడిఓ ప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *