

మన న్యూస్ నిజాంసాగర్ జుక్కల్ మొహమ్మద్ నగర్ మండలంలోని కోమలంచ గ్రామంలో ఉగాది పండుగను పురస్కరించుకొని గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మంగళవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. ఉదయం కొబ్బరికాయ కుస్తీ పోటీలనుంచి ప్రారంభమైన కుస్తీ పోటీలు 100,300,500,1000,వరకు కొనసాగాయి.కుస్తీ పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల వారు అధిక సంఖ్యలో వచ్చారు. గెలుపొందిన మరలయోధులకు నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ సి డి సి చైర్మన్ గంగారెడ్డి, మాజీ సర్పంచ్ సాదుల సత్యనారాయణ, నాయకులు నాగభూషణం గౌడ్ అబ్దుల్ ఖాలీక్, తదితరులు ఉన్నారు.