ఆర్టిస్ట్ డా॥ సునీల్ కుమార్ యాండ్రకు నంది ఆవార్డు ఆవార్డు పట్ల పలువురు హర్షం

మనన్యూస్,పిఠాపురం:సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ ఆర్టిస్ట్ డా॥ సునీల్ కుమార్ యాండ్రకు నంది అవార్డు లభించింది. బంగారుతల్లి లఘుచిత్రానికి కథ, స్క్రీన్ప్లే, మాటలు రచించినందుకు శ్రీ విఘేశ్వర ఆర్ట్ సొసైటీ నిర్వహించిన ఉగాది పురస్కారాల్లో భాగంగా నంది అవార్డుతో రచయిత డా॥ సునీల్ కుమార్ యాండ్రను హైదరాబాద్లోని శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. గత 4నెలల క్రితం శ్రీవిశ్వకర్మ క్రియేషన్స్, ఆర్.కె.క్రియేటివ్స్, జి.వి.వి.ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన బంగారు తల్లి లఘుచిత్రంలో టిక్టాక్ స్టార్ దుర్గారావు దంపతులు, చైల్డ్ ఆర్టిస్ట్ మంజూశ్రీ, నటులు ఆర్.కె, దాకే సింహాచలం, బాబి, సూరిబాబు, పెద్దాడ వెంకటేశ్వరరావు, ఇతర నటీనటులు నటించిన బంగారు తల్లి లఘుచిత్రం కోమటి రామకృష్ణ్ట (ఆర్.కె) దర్శకత్వం వహించగా టిక్టాక్ స్టార్ దుర్గారావు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయ్యిన అతి కొద్ది కాలంలోనే సుమారు లక్ష్యా 80వేల మంది ప్రేక్షకుల తిలకించి విశేష ఆదరణ కనబరిచారు. ఈ సంధర్భంగా నంది ఆవార్డు గ్రహీత డా॥ సునీల్ కుమార్ యాండ్ర మాట్లాడుతూ ఈ ఆవార్డు తనకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్ సొసైటీ ఫౌండర్ ఛైర్మన్ బండారి శ్రీధర్ నానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది సంధర్భంగా ఆవార్డు ప్రధానం చేయడం జరిగిందని, ఈ ఆవార్డు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ జర్నలిస్ట్, వెండితెర, బుల్లితెర నటుడు జెమిని సురేష్, నటులు దిల్ రమేష్, బి.హెచ్.ఈ.ఎల్.ప్రసాద రావు, సినీయర్ దర్శకులు బాబ్జి, నిర్మాత ముసాఆలీఖాన్, మోడల్ సృజన, జూనియర్ పవన్ కళ్యాణ్, జూనియర్ చంద్రబాబు, సుమిత్ మీడియా సిఈఓ వంశీకృష్ణల చేతుల మీదుగా తీసుకోవడం జరిగిదన్నారు. బంగారు తల్లి చిత్రానికి దర్శకత్వం వహించిన డా॥ కోమటి రామకృష్ణకు కూడా ఉత్తమ దర్శకుడిగా ఆవార్డు లభించిందన్నారు. ఈ సంధర్భంగా డా॥ సునీల్ కుమార్ కు పిఠాపురం పట్టణ ప్రముఖులు, రాజకీయనాయకులు, స్నేహితులు, పాత్రికేయ మిత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు