మన న్యూస్,బాన్స్ వాడ
ఇదేంటి విద్యుత్ తీగల కు నిచ్చెన వేశారు అనుకుంటున్నారు కదూ… అవును మీరు అనుకుంటున్నారు నిజమే. కానీ ఈ నిచ్చె ఎక్కి విద్యుత్ తీగలపై కూర్చుండ దానికి కాదు.. నిజామాబాద్ జిల్లా పొతంగల్-జెల్లపల్లి, బీర్కూర్-పొతంగల్ రహదారి పక్కన ఓ రైతు తన పొలంలో విద్యుత్ తీగలు వేలాడటం వల్ల వాటి వల్ల ప్రమాదం జరగకుండా, తన ఇంట్లో ఉన్న నిచ్చెనను ఇలా విద్యుత్ తీగలకు పెట్టి కిందికి వేలాడకుండా ప్రయత్నమే ఇది. ట్రాన్స్కో అధికారులు వారికి ఇష్టం వచ్చిన వారికి చేతులు తడుపుకొని ఇష్ట రాజ్యాంగ విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం, విద్యుత్ తీగలు కిందికి వేలాడకుండా చూడడం కొంతమంది ట్రాన్స్కో శాఖలో పనిచేస్తున్న అధికారుల పనితీరు. కానీ ఈ రైతు పొలంలో దూరంగా విద్యుత్ స్తంభాలు వేయడంతో మధ్యన విద్యుత్ తీగలు చేతుకు తగిలే విధంగా తీగలు వేలాడుతుంటే దీనివల్ల ప్రమాదం అని తెలుసుకున్న రైతు ఇలా వేలాడుతున్న విద్యుత్తు తీగలకు నిచ్చెన వేసి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడ్డారు. ఈ చిత్రాన్ని మన దినపత్రిక తన కెమెరాలో బంధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *