

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస): మండలం కొత్త ఎర్రవరం లో గల మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని కర్రోతు మోహన సాయి కీర్తన నవోదయ లో 6వ తరగతిలో ప్రవేశానికి ఎంపిక అయినందుకు ఏలేశ్వరం మండల విద్యాశాఖాధికారులు విద్యాశాఖ అధికారులు
బి . అబ్బాయి , కె. వరలక్ష్మి హర్షం వ్యక్తం చేసి నవోదయలో సీటు సాధించిన విద్యార్థిని మోహన్ సాయి కీర్తనను, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. సత్యవేణి అభినందించడం జరిగింది, ప్రైవేట్ పాఠశాలల వైపు ఆకర్షలవుతున్న ఈ రోజుల్లో తన కుమార్తెను తాను పని చేయుచున్న పాఠశాలలోనే చేర్పించి నవోదయ ప్రవేశపరీక్షలో సీటు సాధించే విధంగా శిక్షణ ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచిన ఆ పాఠశాల ఉపాధ్యాయినీ కె. దేవదేవి అందరూ ప్రత్యేకంగా అభినందించడం జరిగింది, ఆమె గతంలో తాను పనిచేసిన ఏలేశ్వరం , అంబేద్కర్ నగర్ , ఎం.పి.పి. స్కూల్ లో కూడా నవోదయకు శిక్షణ ఇచ్చి ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యేటట్లు కృషి చేసిన ఉపాధ్యాయులు అందరూ ఈ సందర్భంగా జ్ఞప్తికి తెచ్చుకోవడం జరిగింది. ఈ అభినందన కార్యక్రమంలో మండల యుటిఎఫ్ నాయకులు జట్ల సోమరాజు , శిడగం సంజీవ్ , కడింశెట్టి రవి , ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు కూడా పాల్గొనడం జరిగింది.