

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: దివంగత నేత స్వర్గీయ వరుపుల రాజా ద్వితీయ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఏలేశ్వరం నగర టిడిపి పార్టీ కార్యాలయం నందు టిడిపి యువ నాయకులు బొదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి ఆధ్వర్యంలో దివంగత వరుపులరాజా చిత్రపటా ని పూలమాలలు వేసి ఘనంగా వాళులర్పించారు.అనంతరం ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రం లో మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి, బొదిరెడ్డి గోపీ, టిడిపి నాయకులు, పేషెంట్లకు పండ్లు పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ దివంగత నేత స్వర్గీయ పరుపులు రాజాతో తమ అనుభవాలను గుర్తుచేసుకున్నారు.వరుపుల రాజా వైద్యం,విద్య,పట్ల నియోజకవర్గ ప్రజలకు ఎన్నో సేవలు చేశారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు సూతి బూరయ్య, బుద్ధ ఈశ్వరరావు, జ్యోతుల పెదబాబు, పలివెల శ్రీనివాస్, జగటాపు సూరిబాబు, అరకు రాజు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు వాగు రవి, జొన్నాడ వీరబాబు, కోనాల వెంకటరమణ ఎండగుడి నాగబాబు, పలువురు టీడీపీ నాయకులు వరుపుల రాజా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.