తవణంపల్లి ఫిబ్రవరి 28 మన న్యూస్

తవణంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవం గణనీయంగానిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికిముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి త్యాగరాజు రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకోవాలని మరియు విద్యార్థులలో ఉండే నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యం అని తెలిపారు. జాతీయ సైన్స్ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. వివిధ పాఠశాల విద్యార్థులు ఉంచిన సైన్స్ ప్రదర్శనలను సందర్శించారు. ఉత్తమ ప్రదర్శనలకుబహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో సి. ఆర్ .సి ప్రధానోపాధ్యాయులు దేవరాజులురెడ్డి,ఉపాధ్యాయులు మరియు సిఆర్పి చిట్టిబాబు, గోపి పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *