

కాణిపాకం ఫిబ్రవరి 26 మన న్యూస్
ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా వైభవంగా ప్రధాన ఆలయం నుండి పట్టువస్రాలను సమర్పించిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ , మరియు దేవస్థానం ఈ.వో పెంచల కిషోర్ , పట్టు వస్త్రాల సమర్పించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది, శ్రీ స్వామివారి ప్రధాన ఆలయము నందు ఈరోజు శివరాత్రి సందర్భంగా శ్రీ స్వామివారి ప్రత్యేక అభిషేకము మరియు వైభవంగా గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా పూతలపట్టు అగ్రహారం వాస్తవ్యులు సుబ్రహ్మణ్యం పిలై వారి కుమారులు నిర్వహించారు , శ్రీ స్వామివారి దేవస్థానం నుండి మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని పలు ఆలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ముందుగా ఐరాల మఠంపల్లిలోని వీరభద్ర స్వామివారికి, తరువాత కుళ్ళంపల్లి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారికి, తవణంపల్లి శ్రీకాళభైరవేశ్వర స్వామి వారికి, మరియు బంగారుపాళ్యం మొగిలి నందు స్వయంభుగా వెలసిన శ్రీ మొగిలిశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించిన స్థానిక శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ , మరియు దేవస్థానం ఈ.వో పెంచల కిషోర్ ,ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈ.వో పెంచల కిషోర్ , ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపర్డెంట్ వాసు, తదితరులు పాల్గొన్నారు.