

బంగారుపాళ్యం. ఫిబ్రవరి 26 మన న్యూస్
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి గ్రామంలో వెలసిన శ్రీ కామాక్షి సమేత మొగిళీశ్వర స్వామి దేవస్థానం నందు మహా శివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం నుండి భక్తులతో కిటకిటలాడుతూ మధ్యాహ్నం మూడు గంటలకల్లా స్వామి వారి దర్శనానికి మూడు గంటల సమయం సుమారు వీఐపీ దర్శనానికి రెండు గంటలు, సాధారణ సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. భక్తులకు ముందు జాగ్రత్తగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా స్థానిక సీఐ కత్తి శ్రీనివాసులు నేతృత్వంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయం నందు భక్తులకు త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఆలయంలోపల భక్తులకు కనువిందుగా చెక్కభజనలు నిర్వహించారు. టెంపుల్ స్పెషల్ ఆఫీసర్ సుమన మాట్లాడుతూ, భక్తులు పోలీసు సిబ్బందికి ఆలయ సిబ్బందికి సహకరించాలని సర్వదర్శనం ప్రతి ఒక్కరికి జరిగే విధంగా ఏర్పాటు చేశామని ఆమె పేర్కొన్నారు. తదుపరి సాయంత్రం ఐదు గంటల సమయంలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళి మోహన్, కాణిపాకం ఆలయ ఈవో పెంచల కిషోర్ పట్టు వస్త్రాలను కామాక్షి సమేత ముగిలేశ్వర స్వామికి సమర్పించారు. కార్యక్రమంలో బంగారుపాళ్యం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్ పి జయప్రకాష్ నాయుడు, మండల యువ నాయకుడు ఎంపీ ధరణి నాయుడు, గోల్డ్ మెన్ సుకుమార్ నాయుడు, మొగిలి మంజునాయుడు, నలగాంపల్లి జనార్దన్ గౌడ్, తదితర మండల నాయకులు పాల్గొన్నారు
