

మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడ:
ప్రతిపాడు నియోజకవర్గం, శరభవరం గ్రామానికి చెందిన రామిశెట్టి రాజు కుమారుడు కృష్ణ, ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. హాస్పిటల్ కు వెళ్లి వారిని పలకరించి, ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న మురళి రాజు. అలాగే ధర్మవరం గ్రామానికి చెందిన గళ్ళ శ్రీను గారి భార్య, కాకినాడ సూర్య గ్లోబల్ హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. వారిని హాస్పిటల్ కి వెళ్లి పలకరించి, ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్న, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఈ కార్యక్రమంలో కోలా తాతబాబు, బొల్లు నాగేశ్వరరావు, పోకనాటి వెంకటేశ్వరరావు, జువ్వల దొరబాబు, తదితరులు పాల్గొన్నారు.