

మనన్యూస్,తిరుపతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తిరుపతి పర్యటన సందర్భంగా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి పద్మావతి మహిళా మహిళా విశ్వవిద్యాలయం నందలి 5.70 కోట్ల రూపాయలతో నిర్మించబడిన మల్టి పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను బుధవారం (నేడు) మధ్యాహ్నం 2.15 గం.లకు ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు,పద్మావతీ మహిళా విశ్వ విద్యాలయం వి.సి.ఉమ,రిజిస్ట్రార్ రజినీ తదితరులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసి ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి సయ్యద్ సాహెబ్,తహశీల్దార్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.