

మన న్యూస్ ప్రతినిధి ఏలేశ్వరం:ఏలేశ్వరం మార్స్ కంప్యూటర్స్ అధినేత అడపా దుర్గారావు మాతృమూర్తి 8వ వర్థంతి పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు మంగళవారం చేశారు.దుర్గారావు తల్లి జ్ఞాపకార్ధం పట్టణంలో బాలికలు,బాలల వసతి గృహంలో విద్యార్థులకు చాపలు పంపిణీ చేశారు.లింగంపర్తి గ్రామానికి చెందిన విశ్వహిందూ పరిషత్ ప్రచారకర్త వీర భద్రరావు అప్పలరాజు దంపతుల కుటుంబానికి 25కేజీల బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో కోరాడ రాజు, హాస్టల్ వారెన్స్ సిద్ధాంతపు నూకరాజు, పోతుబంది దేవతయ్య, ఉడతల రమణారావు తదితరులు పాల్గొన్నారు.