మనన్యూస్,తిరుపతి:రామస్వామి నాయకర్ గొప్ప మానవతావాది మూడ సిద్ధాంతాలను మూఢనమ్మకాలను కులతత్వాన్ని వ్యతిరేకించి మానవులందరూ సమానమే అని మనుషులందరికీ సమానమైన స్వేచ్ఛ స్వాతంత్రం ఉండాలని మనుష్యులు అందరికీ స్వతంత్ర స్వతంత్రంగా ఎదగడానికి సమాన అవకాశాలు కావాలని ఏడు దశాబ్దాలు ఉద్యమం చేసిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు సామాజిక విప్లవకారుడు పెరియార్ రామస్వామి నాయకర్ అని ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు టీ గోపాల్ తెలిపారు
నేడు తిరుపతిలోని బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యాలయంలో జరిగిన బీసీ ఉద్యోగుల సమాఖ్యBCEF ముఖ్య కార్యకర్తల సమావేశంలో
టి గోపాల్ గారు మాట్లాడుతూ నిన్నటి రోజు తిరుపతిలో పుస్తక ప్రదర్శన ప్రాంగణంలో కొందరు మూర్ఖులు పెరియార్ జీవిత చరిత్ర పుస్తకాలు ప్రదర్శన ప్రాంగణంలో ఉండకూడదని వివాదం సృష్టించిన సంఘటన దురదృష్టకరమని ఇది వారి అజ్ఞానానికి చాందస మూఢనమ్మకాలకు నిదర్శనమని రాజ్యాంగంలో ఆర్టికల్ 14 16 ప్రకారం దేశంలో ప్రతి మనిషికి స్వేచ్ఛ సమానత్వం ఉన్నదని తనకు నచ్చిన భావజాలాన్ని మతాన్ని అనుసరించే హక్కు ఉన్నదని గోపాల్ తెలిపారు. బి సి ఈ ఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు సురేష్ బాబు మాట్లాడుతూ సృష్టిలో జన్మతః మనుషులందరి సమానమేనని వారికి కుల ప్రతిపాదికన ఉత్తమలని అదమలని వేరుచేసి అంటరానితనాన్ని అంటగట్టి మనుషులని వేరేగా చూసే మనుషులను మనుషులుగా చూడకుండా విడదీసే సందర్భంలో నిన్న కుల ఉద్యమ నాయకుడిగా దక్షిణ భారతదేశంలో పెరియార్ సమానత్వం కోసం స్వేచ్ఛ కోసం పోరాడారని తెలిపారు బిసి ఈ ఎఫ్ తిరుపతి జిల్లా అధ్యక్షులు శ్రీ మార్కంటి గణేష్ బాబు మాట్లాడుతూ శాస్త్రము విజ్ఞానము పెరిగిన ఈ రోజుల్లో కూడా మతతత్వాదులు చాందస భావాలతో మానవ సమాజాన్ని తిరోగమనవైపు నడిపించడానికి ప్రయత్నిస్తున్నారని ఇది చాలా దురదృష్టకరమని సామాజిక విప్లవకారుడు మానవత్వానికి ప్రతిరూపం శ్రీ ఇవి రామస్వామి నాయకర్ పెరియర్ అని పెరియార్ వారసులుగా భారతదేశంలో 80 కోట్ల మంది బడుగు బలహీన వర్గాలు ఉన్నారని ఆ చాందసవాదులకు హెచ్చరిక చేశారు బి సి ఈ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ వంకీ పురం పవన్ మాట్లాడుతూ 21వ శతాబ్దంలో కూడా మూఢనమ్మకాలు ప్రోత్సహిస్తూ మనుషుల్ని కులాల పేరుతో చిన్న చూపు చూస్తూ కొన్ని రాజకీయ భావజాల వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయని ఇది సమాజానికి శ్రేయస్కారం కాదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిసి ఈ ఎఫ్ జిల్లా కోశాధికారి సునీల్ దత్త నాయకులు, గోపి వినోద్ కుమార్ విజయ్ కుమార్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *