

మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, పద్మశ్రీ పురస్కారం పొందిన మందకృష్ణ మాదిగకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు శుభాకాంక్షలు తెలిపారు.మాదిగ ప్రజాప్రతినిధులతో కలిసి మంగళవారం ఆయనను కలిసి సన్మానించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మానుకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ కాశీం పాల్గొన్నారు.
