

మనన్యూస్,తిరుపతి:శ్రీకాళహస్తిలో ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రులతో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుష్పవతి యాదవ్ కూడా పాల్గొని పెన్షన్లను పంపిణీ చేశారు.శనివారం శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నేతృత్వంలో వృద్ధులకు,వికలాంగులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్,దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి లు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వారితో పాటు పుష్పావతి యాదవ్ కూడా పాల్గొని వృద్ధులకు,వికలాంగులకు పెన్షన్లను అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిలో దూసుకుపోతోందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.మరో రెండేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి కావడంతో పాటు పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు.