

మనన్యూస్,పినపాక:కాంగ్రెస్ మండల అధ్యక్షుడుకి మరో అరుదైన గౌరవం దక్కింది.సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా ఉన్న ఆయనకు కాంగ్రెస్ పార్టీ సమూచిత స్థానం కల్పించి గౌరవం ఇచింది.పార్టీ కోసం,బీసీ సంక్షేమము కోసం నిరంతరం పనిచేస్తున్న గొడిశాలను తెలంగాణ రాష్ట్ర బిసి ఆర్గనైజింగ్ రాష్ట్ర సెక్రటరీగా నియమించినది.ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ప్రకటన విడుదల చేసారు.బీసీ సంక్షేమ సంఘం భద్రాద్రి జిల్లా ఇంచార్జి బుర్ర సోమేశం గౌడ్ చేతులమీదుగా శనివారం రామనాదం నియామక పత్రం అందుకున్నారు.ఆయన మాట్లాడుతూ పినపాక నియోజకవర్గం లో ఎమ్మెల్యే పాయం హయాంలో బీసీలకు అధిక ప్రాధాన్యత దక్కుతుందని,అందుకు తనకు లభించిన పదవే ఉదాహరణ అని రామానాదం పేర్కొన్నారు.జిల్లాలో బీసీ సంక్షేమము కోసం నిత్యం పోరాటం చేస్తానని,తనకు పదవి ఇచ్చినందుకు నాయకులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు