

Mana News , Tirupati :- మానవులకు భగవన్నామస్మరణ ఒక్కటే ముక్తికి మార్గమని ఉడిపికి చెందిన పెజావర మఠాధిపతి శ్రీవిశ్వప్రసన్నతీర్థస్వామీజీ ఉద్ఘాటించారు. శ్రీవారి పరమభక్తుడు, కర్ణాటక సంగీత పితామహుడు అయిన శ్రీపురందరదాసుల ఆరాధన మహోత్సవాలు మంగళవారం టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుమలలోని ఆస్థాన మండపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అనుగ్రహభాసనం చేస్తూ గురువుల మార్గదర్శనంతో సులభంగా శ్రీవారి అనుగ్రహం పొందవచ్చన్నారు.