మనన్యూస్,కామారెడ్డి:అర్హులైన గౌడ కులస్తులందరికీ గీతా కార్మిక లైసెన్సులు అందిస్తామని ఎక్సైజ్ సూపరిండెంట్ హనుమంతరావు అన్నారు.కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో మంగళవారం జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా క్యాలెండర్ ను ఆవిష్కరించి మాట్లాడారు.గౌడ కులస్తులు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.గౌడ సమస్యల పరిష్కారానికి జై గౌడ ఉద్యమం చేస్తున్న కృషిని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జై గౌడ్ ఉద్యమం జిల్లా అధ్యక్షులు రంగోళ్ళ మురళి గౌడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్న గారి శ్రీనివాస్ గౌడ్,ఇందూరి సిద్ధా గౌడ్,తలమడ్ల మురళి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *